టీడీపీని ‘ఓఎల్ఎక్స్’లో పెట్టుకునే పరిస్థితి వస్తుంది: వైసీపీ ఎమ్మెల్యే రోజా సెటైర్లు
- ఎన్నికల వాయిదాతో కేంద్రం నిధులు రాకుండా చేశారు
- చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
- ‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మాదే విజయం
తెలుగుదేశం పార్టీపైనా, చంద్రబాబునాయుడుపైనా వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఉన్న చంద్రబాబు ఎన్నికలు వాయిదా వేసేందుకు తన మనిషి అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ తో నాటకాలు ఆడించారని విమర్శించారు. ఎవరితోనూ, చివరకు ప్రభుత్వంతో కూడా చర్చించకుండా నిర్ణయం తీసుకున్న రమేశ్ కుమార్ ‘అన్నీ తానే’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కరోనా పేరిట ఎన్నికలు వాయిదా వేశామని చెబుతున్నప్పటికీ, చంద్రబాబు కోసమే వాయిదా వేశారన్న విషయం అర్థమవుతోందని అన్నారు.
‘స్థానిక’ సంస్థల ఎన్నికలు వాయిదా వేయించడం ద్వారా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన రూ.5 వేల కోట్లు రాకుండా కుట్ర చేశారని బాబుపై మండిపడ్డారు. ‘స్థానిక’ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తమదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలతో టీడీపీని ‘ఓఎల్ఎక్స్’లో పెట్టుకునే పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన ఐదు వేల కోట్లను అడ్డుకున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.