కరోనా ఎఫెక్ట్... సినిమా షూటింగులే కాదు, టీవీ సీరియళ్లు కూడా బంద్

కరోనా ఎఫెక్ట్... సినిమా షూటింగులే కాదు, టీవీ సీరియళ్లు కూడా బంద్
  • కరోనా కట్టడికి చర్యలు
  • షూటింగుల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్న చిత్రపరిశ్రమలు
  • హైదరాబాదులో సమావేశమైన టాలీవుడ్ పెద్దలు
  • సోమవారం నుంచి టాలీవుడ్ చిత్రాల షూటింగ్ నిలిపివేత
కరోనా మహమ్మారిని ఆదిలోనే నియంత్రించేందుకు యావత్ భారతం ఏకతాటిపై నడుస్తోంది. భారత్ లో ఇప్పుడిప్పుడే పాజిటివ్ కేసులు నమోదవుతున్న తరుణంలో సినిమా థియేటర్లు, సినిమా షూటింగులు అన్నీ నిలిపివేశారు. దేశంలోని అన్ని ఫిలిం ఇండస్ట్రీలు షూటింగుల నిలిపివేతపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. దేశవ్యాప్తంగా సినిమా షూటింగులే కాదు, బుల్లితెర సీరియళ్ల చిత్రీకరణ కూడా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిలిచిపోనుంది. డిజిటల్ షోలు, వెబ్ సిరీస్ ల షూటింగులు కూడా బంద్ కానున్నాయి.

తాజాగా, హైదరాబాద్ లోని ఫిలిం చాంబర్ లో టాలీవుడ్ పెద్దలు సమావేశమయ్యారు. సోమవారం నుంచి షూటింగ్ లు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో ఫిలిం చాంబర్ అధ్యక్షుడు నారాయణదాస్ నారంగ్, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్, మా యాక్టింగ్ ప్రెసిడెంట్ బెనర్జీ, కార్యదర్శి జీవిత తదితరులు పాల్గొన్నారు.


More Telugu News