ఎందుకు ప్రతి దానికీ కుల ప్రస్తావన తెస్తున్నావు?: జగన్ కు చంద్రబాబు సూటి ప్రశ్న
- జగన్ కు ఏదైతే ఇష్టముండదో దానికి ‘కులం’ అంటగడతారు
- ఈ ముఖ్యమంత్రి ఒక కులం వారు వేసిన ఓట్లతోనే గెలిచాడా?
- కుల ప్రస్థావన తెచ్చే సీఎంని, పార్గీని నా జీవితంలో చూడలేదు
ఏపీ సీఎం జగన్ కు ఏదైతే ఇష్టముండదో దానికి ‘కులం’ అంటగడుతున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ పుట్టకుముందు నుంచి ఉన్న పత్రికలకూ కులాలు అంటగడుతున్నాడని, చివరకు, ఎన్నికల కమిషన్ ని ఇదే దృష్టితో చూస్తున్నాడని ధ్వజమెత్తారు. ఈ ముఖ్యమంత్రి ఒక కులం వారు వేసిన ఓట్లతోనే గెలిచాడా? ఎందుకు కుల ప్రస్తావన తెస్తున్నావు? అంటూ మండిపడ్డారు. ‘కుల ప్రస్థావన తెచ్చే ముఖ్యమంత్రిని, పార్టీని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు’ అని అన్నారు. కావాలని కుల ప్రస్తావన తీసుకొస్తున్నారని, ఇవన్నీ ప్రజలు నమ్ముతారని అనుకోవడం కరెక్టు కాదని జగన్ కు హితవు పలికారు.
రాష్ట్రానికి ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ‘అరిష్టం’ అని, ప్రజలకు ‘శాపం’ అని జగన్ పై విమర్శలు చేశారు. శాసనమండలి, ఎన్నికల కమిషన్ పై విమర్శలు చేస్తున్న జగన్, రేపు న్యాయస్థానాలపైనా ఇదే తీరున మాట్లాడతాడేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణ, మాన, ఆస్తులు కాపాడటానికి అన్ని విధాలా పోరాడతామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అన్నారు.