జాతీయ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ఎన్నికలు వాయిదా వేశాం: ఎస్ఈసీ
- కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిందని వెల్లడి
- విపత్తుపై ఆదేశాలు తొలగించిన పిదప ఎన్నికలు నిర్వహిస్తామన్న ఎస్ఈసీ
- ఎన్నికల కమిషనర్ కు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారంటూ విచారం
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తిని కారణంగా చూపుతూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదావేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ వర్గాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ఎన్నికల సంఘం తన నిర్ణయంపై వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించింది, జాతీయ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ఎన్నికలు వాయిదా వేశామని ఎస్ఈసీ తెలిపింది. కరోనాపై విపత్తు ఆదేశాలు ఉపసంహరించిన తక్షణమే ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించింది.
ప్రస్తుతం ఎన్నికలను నిలుపుదల మాత్రమే చేశామని, రద్దు చేయలేదని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర వ్యవస్థ అని ఎస్ఈసీ ఉద్ఘాటించింది. హైకోర్టు జడ్జికి ఉండే అధికారాలు ఎన్నికల కమిషనర్ కు ఉంటాయని, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవారికి దురుద్దేశాలు ఆపాదించడం తీవ్ర విచారకరం అని పేర్కొంది.