మన మేధావి నా సలహాలను పట్టించుకోకుండా ఎక్సైజ్ సుంకం పెంచారు: రాహుల్ గాంధీ

  • చమురుపై రూ.3 ఎక్సైజ్ సుంకం పెంచిన కేంద్రం
  • గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు తగ్గితే దేశంలో పెంచడమేంటన్న రాహుల్
  • ఇంధన ధరలు తగ్గించాలని లేఖ రాసినా పట్టించుకోలేదని అసంతృప్తి
అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు బాగా క్షీణించినప్పుడు ఆ ప్రయోజనాల్ని దేశ ప్రజలకు అందించకుండా, ఎక్సైజ్ సుంకాన్ని మరింత పెంచారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు పతనం అయ్యాయని, ఈ తరుణంలో దేశంలో ఇంధన ధరలు తగ్గించి ప్రజలకు మేలు చేయాలంటూ ప్రధాని మోదీకి లేఖ రాశానని, కానీ మన మేధావి ఉన్న ధరలకు తోడు మరింత ఎక్సైజ్ సుంకం వడ్డించారని రాహుల్ విమర్శించారు. దేశంలో ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకం పెంపు నిర్ణయం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం డీజిల్, పెట్రోల్ పై లీటర్ కు రూ.3 చొప్పున ఎక్సైజ్ సుంకం పెంచడం తెలిసిందే.


More Telugu News