విజయవాడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భద్రత పెంపు

  • స్థానిక ఎన్నికలు ఆరు వారాలు వాయిదావేసిన ఎస్ఈసీ
  • కరోనా కారణంగా నిర్ణయం తీసుకున్నామన్న ఎన్నికల కమిషనర్
  • ఎస్ఈసీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్న సీఎం జగన్, వైసీపీ నేతలు
  • బందరు రోడ్డులో ఎస్ఈసీ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ ప్రకటించిన నేపథ్యంలో విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద భద్రత పెంచారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం బందరు రోడ్డులో ఉండగా, పటిష్ట భద్రత కల్పించారు.

రాష్ట్రంలో ఎన్నికలను ఆరు వారాలు నిలిపివేస్తున్నట్టు ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ ప్రకటించడం తెలిసిందే. కరోనా కారణగా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. ఆరు వారాల తర్వాత కొత్త షెడ్యూల్ ఉంటుందని వెల్లడించారు. అయితే, ఎస్ఈసీ నిర్ణయంపై సీఎం జగన్ సహా వైసీపీ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు.


More Telugu News