తనకు చెప్పకుండా ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారని గవర్నర్‌ను జగన్‌ అడిగారా?: దేవినేని ఉమ

  • ఎన్నికల వాయిదాపై జగన్ గింజుకుంటున్నారు
  • దీనిపై తన మీడియాలో లీకులు ఇచ్చుకున్నాడు 
  • జగన్  చేయాల్సిన పని ఎన్నికల కమిషన్ చేసింది 
  • ప్రజలకు కరోనా వైరస్‌పై వివరణ ఇవ్వరా?
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఎందుకు కలిశారని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. 'నాకు చెప్పకుండా ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారని అడగడానికి గవర్నర్‌ను సీఎం కలిశారా? ఎన్నికలు వాయిదా వేసినందుకు జగన్‌ అసంతృప్తి చెందుతున్నారట. పొద్దుటి నుంచి ఆయన ఇదే విషయంపై ఆలోచిస్తున్నారట' అని చెప్పారు.

'ఈ విషయంపై గింజుకుంటే గింజుకున్నారు. దీనిపై తన మీడియాలో లీకులు ఇచ్చుకున్నాడు. ఇది ఇంకో అవమానం. ఈ లీకులు ఎందుకు? గింజుకోవడాలెందుకు? నువ్వు చేయాల్సి న పని ఎన్నికల కమిషన్ చేసింది. ఇంత మంది మంత్రులు గడ్డిపీకుతున్నారా? ప్రజలకు కరోనా వైరస్‌పై వివరణ ఇవ్వరా? చర్యలు తీసుకోరా?  కరోనా వైరస్‌ గురించి చర్యలు తీసుకోని ఈ ప్రభుత్వం తీరు సరికాదు' అని దేవినేని ఉమ విమర్శించారు.

జగన్‌ మాట్లాడాలి..
కరోనా వైరస్‌ మీద ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడాలని, ఆయన నోరు తెరిచే వరకు ప్రతిరోజు తాను ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలవకపోతే మంత్రుల పదవులు ఊడిపోతాయని జగన్‌ హెచ్చరించారు. అందుకే, మాచర్లతో పాటు పలు ప్రాంతాల్లో దాడులు జరిగాయని విమర్శించారు.



More Telugu News