పది నెలల తుగ్లక్ పాలన లో నిరుద్యోగులను నిలువునా ముంచారు: నారా లోకేశ్
- చంద్రబాబు హయాంలోనే యువతకు ఎక్కువ శాతం ఉద్యోగాలు
- ఏపీకి వస్తా అన్న కంపెనీలనూ వద్దన్నారు
- ‘నిరుద్యోగ భృతి’ కూడా ఎత్తేశారు
చంద్రబాబు హయాంలోనే యువతకు ఎక్కువ శాతం ఉద్యోగాలు వచ్చాయన్న విషయాన్ని సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వమే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిందని, నిజాన్ని ఒప్పుకుందని టీడీపీ నేత నారాలోకేశ్ అన్నారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేశారు. టీడీపీ హయాంలో రాష్ట్ర యువతకి పరిశ్రమల శాఖ ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు వచ్చాయని వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా నిజాన్ని ఒప్పుకుందని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి రివర్స్ అయిందని, 10 నెలల తుగ్లక్ పాలన లో నిరుద్యోగులను నిలువునా ముంచారని విమర్శించారు. ఉన్న కంపెనీలను తరిమేశారు. ఏపీకి వస్తా అన్న కంపెనీలనూ వద్దన్నారని, ‘నిరుద్యోగ భృతి’ కూడా ఎత్తేసి ఆకలేసి కేకలేసే పరిస్థితి తెచ్చారని ధ్వజమెత్తారు.