కరోనా విజృంభణ నేపథ్యంలో హైదరాబాద్‌లో పార్కులన్నీ బంద్
- నగర శివారులో ఉన్న జిల్లాల్లో ఉన్న పార్కులు కూడా మూసివేత
- ఈ నెల 21 వరకు బంద్
- పీపుల్స్ ప్లాజాలో సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు
తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్‌తో పాటు నగర శివారులో ఉన్న జిల్లాల్లో ఉన్న పార్కులు మూసివేస్తున్నట్లు హెచ్‌ఎండీఏ ప్రకటన చేసింది.
ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లోని లుంబినీపార్క్, ఎన్టీఆర్ గార్డెన్, మెమోరియల్, సంజీవయ్య పార్క్‌లను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. జలగం వెంగళరావు పార్కు, పబ్లిక్ గార్డెన్, జల విహార్, నెహ్రూ జూపార్క్, ఇందిరా పార్క్ వంటి అన్ని మున్సిపాలిటీల్లోని పార్కులను మూసివేస్తున్నట్లు పేర్కొంది. అలాగే ప్రజలు అధికంగా పర్యటించే పలు ప్రాంతాలను మూసేస్తున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో సభలు, సమావేశాలకు అనుమతులు రద్దు చేశారు.