ఇంతగా దిగజారి ఇటువంటి ట్వీట్ చేస్తారా?: దేవినేని ఉమ ఫైర్
- కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ తట్టి లేపింది
- దాన్ని వదిలేసి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు ఈ రోజు
- దిగజారిపోయి ట్వీట్ చేశారు
- ఎన్నికలంటే భయపడ్డారని మాపై ప్రచారం చేస్తున్నారు
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశంపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు స్పందిస్తూ ఏపీ సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు ఉదయం విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై మండిపడ్డారు.
'కరోనా వైరస్ గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ తట్టి లేపితే, దాన్ని వదిలేసి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు ఈ రోజు. దిగజారిపోయి ట్వీట్ చేశారు.. బాధ్యతగల హోదాలో ఉన్నవారు ఇటువంటి తీరు కనబర్చడం ఏంటీ? ఎన్నికలంటే భయపడ్డారని మాపై ప్రచారం చేస్తున్నారు' అని చెప్పారు.
'టీడీపీకి అభ్యర్థులు దొరకక 5 నుంచి 10 లక్షల రూపాయలు ముట్టచెప్పి నామినేషన్లు వేయించారు' అని విజయసాయిరెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేకపోవడంతో దివాళాకోరు ప్రయత్నాలు మొదలు పెట్టారని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.
కాగా, ప్రభుత్వం తానా అంటే అధికారులు తందానా అంటున్నారని దేవినేని ఉమ విమర్శించారు. 'రిజర్వేషన్ల ప్రక్రియను ఇష్టం వచ్చినట్లు మార్చారు. అధికారులు ఎందుకు అంతటి అత్యుత్సాహంతో వ్యవహరిస్తున్నారు' అని విమర్శించారు.