ఎన్నికల వాయిదాపై గవర్నర్‌తో కీలక చర్చలు జరుపుతున్న సీఎం జగన్‌

  • రాజ్‌భవన్‌లో భేటీ
  • అంతకు ముందు కరోనాపై అధికారులతో జగన్ చర్చలు
  • కరనాపై నివేదికలు పరిశీలించిన జగన్
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు. కరోనా విజృంభణ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై గవర్నర్‌తో ఆయన ప్రధానంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలపై కూడా చర్చించనున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్‌ సమావేశాలపై గవర్నర్‌కు జగన్‌ పలు వివరాలు తెలపనున్నట్లు తెలుస్తోంది.

అంతకుముందు జగన్‌ కరోనా వ్యాప్తి నివారణపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని,  వైద్యశాఖ అధికారులు పాల్గొన్నారు. కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ నుంచి జగన్ నివేదికలు తెప్పించుకుని పరిశీలించారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది.


More Telugu News