ఐఏఎస్, ఐపీఎస్‌లందరిని తనతో పాటు జైలుకి తీసుకెళ్లడానికి జగన్ యత్నిస్తున్నారు: బుద్ధా వెంకన్న
- బాధ్యతలేకుండా ప్రవర్తించిన అధికారుల ఉద్యోగాలు ఊడగొడతాం
- జగన్ చెప్పినట్లు వినకండి.. మీ పని మీరు చేయండి
- జగన్ ఇప్పుడుంటారు.. రేపు జైలుకి వెళతారు
- గతంలో 16 నెలలు అప్పుడు ఆయన జైలులో ఉన్నారు
మాచర్లలో తమపై హత్యాయత్నం జరిగిందని, దీనిపై చర్యలు తీసుకోవట్లేరని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఆరోపించారు. ఈ రోజు ఆయన మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ... 'మా మీద దాడి చేశారు. ఒకరోజు నిందితుడిని అరెస్టు చేశామని అంటారు. ఒకరోజు అరెస్టు చేయలేదని అంటున్నారు. నిందితుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి. ఏకగ్రీవమైన ఎన్నికలు రద్దు చేయాలి' అని డిమాండ్ చేశారు.
'రద్దు చేసి మళ్లీ వైసీపీ గెలిస్తే అప్పుడు మా ఓటమిని ఒప్పుకుంటాం. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేయట్లేదు. జగన్‌కి వాలంటరీలుగా పోలీసులు పనిచేస్తున్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కలుగజేసుకోవాలి. ఇదే మా డిమాండ్. మాచర్ల ఎన్నికలు రద్దు చేసి మళ్లీ ప్రజా తీర్పుకోరండి' అని చెప్పారు.
జైలుకెళతారు.. జాగ్రత్త
'అక్కడ దాడులు ఎలా చేశారో ప్రజలు అందరూ గమనిస్తున్నారు. అధికారులకు కూడా చెబుతున్నాం.. చిన్నదాడి అటూ సిల్లీగా తీసుకుంటున్నారు. మేము కోర్టుకి వెళతాం.. బాధ్యతలేకుండా ప్రవర్తించిన అధికారుల ఉద్యోగాలు ఊడగొడతాం.. జగన్ చెప్పినట్లు వినకండి.. మీ పని మీరు చేయండి. జగన్ ఇప్పుడుంటారు.. రేపు జైలుకి వెళతారు. 16 నెలలు అప్పుడు ఆయన జైలులో ఉన్నారు. అలాగే, రేపు ఆయనకు అనుకూలంగా పనిచేయిస్తూ ఏఏఎస్, ఐపీఎస్‌లందరికీ తనతో పాటు జైలుకి తీసుకెళ్లడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు' అని విమర్శించారు.