6 వారాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి.. కనీసం ఇప్పుడయినా ప్రశాంతంగా నిర్వహించాలి: కేశినేని
- జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారు
- ఏపీలో అరాచక పరిస్థితులు బీహార్‌ను మించిపోయాయి
- రాష్ట్ర పోలీసులు చట్టానికి కట్టుబడి విధులు నిర్వర్తించాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ ఎన్నికల వాయిదాపై ఆయన స్పందిస్తూ ఎన్నికలను ఇప్పటికైనా సరైన పద్ధతితో నిర్వహించాలని కోరారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్‌కు ఒక్క అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసపోయారని, ఏపీలో అరాచక పరిస్థితులు బీహార్‌ను మించిపోయాయని కేశినేని నాని విమర్శించారు. వైసీపీ కార్యకర్తలు ప్రత్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారనని, 6 వారాల తర్వాత వాయిదా పడింది కాబట్టి అప్పుడయినా రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. రాష్ట్ర పోలీసులు అధికారంలో పార్టీ ఆదేశాలు ప్రకారం కాకుండా చట్టానికి కట్టుబడి విధులు నిర్వర్తించాలని ఆయన చెప్పారు.