కరోనా వైరస్ విజృంభిస్తోంటే జగన్ తాడేపల్లిలో కూర్చుని పబ్జీ గేమ్ ఆడుతున్నారు: దేవినేని ఉమ
- కరోనాను అరికట్టడానికి ఏ చర్యలు తీసుకుంటున్నారు?
- స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగిన చోట్ల అవన్నీ రద్దు చేయాలి
- ఎన్నికల కమిషన్ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాపై వారు స్పందిస్తూ ఎన్నికలను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. కరోనా వైరస్ విజృంభణపై అన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటుంటే ఏపీ సీఎం జగన్ మాత్రం తాడేపల్లిలో కూర్చుని పబ్జీ గేమ్ ఆడుతున్నారని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందని నిలదీశారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగిన చోట్ల అవన్నీ రద్దు చేయాలని ఆయన అన్నారు.
ఎన్నికల వాయిదాలు కరోనా వ్యాప్తి ఎంతమాత్రం కారణం కాదని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ దాడులతో ఎలా జరుగుతుందో అందరూ చూశారని అన్నారు. ఇలా ఎన్నికలు వాయిదాపడటం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎన్నికలు వాయిదా వేయడం కాదని, రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ తిరిగి నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.