ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలి: జీవీఎల్
- కాకినాడలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న జీవీఎల్
- ఎన్నిక వాయిదా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
- నామినేషన్లను మళ్లీ స్వీకరించాలి
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థ ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేయడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు తెలిపారు. కాకినాడలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు.
నామినేషన్లను మళ్లీ స్వీకరించాలని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న విషయం తెలిసిందే. ప్రతిపక్ష అభ్యర్థులపై దాడులు చేస్తూ బెదిరిస్తున్నారని, శ్రీకాళహస్తి, చిత్తూరు, ఏలూరులో జరిగిన దాడులను ఖండిస్తున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దాడులపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామన్నారు.