చైనాపై ఒక రేంజ్‌లో మండిపడిన పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్

  • అసలా కుక్కల్ని, పిల్లుల్ని తినడం ఏంటి?
  • మీ కారణంగా ప్రపంచం స్తంభించిపోయింది
  • మీ సంస్కృతి ఇప్పుడు మిమ్మల్నే ప్రమాదంలోకి నెట్టేసింది
చైనా ఆహారపు అలవాట్ల వల్ల ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. అక్కడి జంతు సంరక్షణ చట్టాలు ఏమైపోయాయని ప్రశ్నించాడు. తన యూట్యూబ్ చానల్‌లో మాట్లాడుతూ.. చైనా తీరును ఎండగట్టాడు. కుక్కల్ని, పిల్లుల్ని ఎలా తింటారని మండిపడ్డాడు. అసలు గబ్బిలాలను ఎలా తినాలనిపిస్తోందని నిలదీశాడు. వాటి రక్తాన్ని, మూత్రాన్ని తాగి ప్రపంచంపైకి వైరస్‌ను వదులుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారు ఆహారపు అలవాట్ల వల్ల ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందన్నాడు. అసలు వారు కుక్కల్ని, పిల్లుల్ని ఎలా తింటారో తనకు అర్థం కావడం లేదన్నాడు. చైనా వారి చర్యల వల్ల తనకు చాలా కోపంగా ఉందన్నాడు.

మూగజీవాలను తినడం వారి సంస్కృతిలో ఒక భాగమన్న విషయం తనకు తెలుసని అయితే, ఇప్పుడదే వారికి చేటు చేసిందని అక్తర్ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతమాత్రానికి చైనాను నిషేదించాలని తాను చెప్పడం లేదని, వారి ఆహారపు అలవాట్లను మాత్రమే ప్రశ్నిస్తున్నానని పేర్కొన్నాడు. కరోనా ప్రభావంతో పీఎస్ఎల్ కళ తప్పిందని, ప్రేక్షకులు లేకుండానే ఆడాల్సి వస్తోందని అక్తర్ వాపోయాడు.


More Telugu News