31 తర్వాత పెళ్లిళ్లు కూడా బంద్: తెలంగాణ ప్రభుత్వం

  • ఈ నెల 31 తర్వాత మ్యారేజ్ హాళ్లు బంద్
  • ఇప్పటికే నిర్ణయమైన వాటికి మాత్రమే అనుమతి
  • పెళ్లిలో అతిథులు 200 మందికి మించరాదు
దేశంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 31 వరకు స్కూళ్లను మూసివేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, 31 తర్వాత పెళ్లిళ్లకు కూడా అనుమతి ఇవ్వబోమని తేల్చి చెప్పింది. స్కూళ్ల మూసివేత విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇక, ఇప్పటి వరకు నిర్ణయమైన పెళ్లిళ్లకు మాత్రమే అనుమతి ఇస్తామని, 31వ తేదీ వరకు మాత్రమే వివాహ మండపాలు తెరిచి ఉంచుతామని పేర్కొంది. ఆ తర్వాత పెళ్లిళ్లకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అంతేకాదు, పెళ్లికి హాజరయ్యే అతిథులు 200 మందికి మించకూడదని ఆంక్షలు విధించింది. ఈ నెల 31 తర్వాత మ్యారేజ్ హాల్స్‌కు కూడా అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


More Telugu News