ఏసీ బోగీల్లో కర్టెన్ల తొలగింపు... బెడ్ షీట్లు ఇవ్వరాదని రైల్వే శాఖ సంచలన నిర్ణయం!
- నానాటికీ పెరుగుతున్న కరోనా భయం
- వ్యాధి సోకిన వ్యక్తి ఎక్కితే ఇతరులకు సులువుగా వ్యాప్తి
- ఎవరి బెడ్ షీట్ ను వారే తెచ్చుకోవాలన్న రైల్వేస్
రోజురోజుకూ కరోనా భయం పెరుగుతున్న వేళ, ఇండియన్ రైల్వేస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీ బోగీల్లో కర్టెన్లను తొలగించాలని, దిండ్లు, బెడ్ షీట్లను ఎవరికీ ఇవ్వరాదని నిర్ణయించింది. కరోనా సోకిన వ్యక్తి ఎవరైనా రైలు ఎక్కితే, కర్టెన్లు, బెడ్ షీట్ల ద్వారా అది ఇతరులకు సులువుగా వ్యాపించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం.
ఏసీ కోచ్ ల్లోని అన్ని కర్టెన్లు తొలగించాలని ఇప్పటికే పశ్చిమ రైల్వే నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. మిగతా రైల్వే జోన్లు కూడా ఇదే నిర్ణయం తీసుకోనున్నాయి. ప్రయాణికులు ఎవరి దుప్పట్లను వారే తెచ్చుకోవాలని ఈ సందర్భంగా రైల్వే శాఖ సూచించింది.