ఇండియాలోని అన్ని యూఎస్ కాన్సులేట్ల మూసివేత!
- వీసా ప్రాసెసింగ్ ఇంటర్వ్యూలు రద్దు
- ఎంబసీల్లోకి భారతీయుల ప్రవేశంపైనా నిషేధం
- ఆగిపోయిన హెచ్1-బీ వీసాల జారీ
కరోనా వైరస్ తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న వేళ, అమెరికా రాయబార కార్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నుంచి ఇండియాలోని అన్ని యూఎస్ ఎంబసీల్లో వీసా ప్రాసెసింగ్ ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నామని ప్రకటించింది. ముంబయి, చెన్నై, కోల్ కతా తదితర నగరాల్లోని యూఎస్ ఎంబసీల్లోకి ప్రజల ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూఎస్ ఎంబసీ వెబ్ సైట్ ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఈ నెలలో వీసా ఇంటర్వ్యూల షెడ్యూల్ ను పెట్టుకున్న వారంతా అయోమయంలో పడ్డారు.
ఇక ఈ ప్రభావం హెచ్1-బీ వీసా ఇంటర్వ్యూలకు సిద్ధంగా ఉన్న వారిని అశనిపాతంలా తాకింది. వీరంతా యూఎస్ లోని తాము పనిచేయాల్సిన కంపెనీలకు ఫోన్లు చేసి, విషయాన్ని వివరిస్తున్నారు. ఇంటర్వ్యూలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపైనా ఎంబసీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఇదే సమయంలో యూఎస్ లో ఉంటున్న వారిని వివాహం చేసుకున్న నవ వధువులు కొంతకాలం భర్తల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు. ఇక అమెరికా నుంచి వివిధ పనులపై వచ్చిన ఎన్నారైలు సైతం ఇండియాలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది.