నేడు, రేపు మాత్రమే సర్వదర్శనం... ఆపై తిరుమలలో నూతన దర్శన విధానం!

  • ఇక కేవలం టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాలే
  • ఎక్కడా ఆగకుండా స్వామి దర్శనానికి
  • ఈ ఉదయం 4 కంపార్టుమెంట్లలో భక్తులు
తిరుమలలో మంగళవారం నుంచి కేవలం టైమ్ స్లాట్ టోకెన్ దర్శనాలను మాత్రమే అనుమతిస్తామని, నేడు, రేపు మాత్రమే సర్వదర్శనం ఉంటుందని టీటీడీ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు, తమకు కేటాయించిన సమయానికి క్యూలైన్లలోకి ప్రవేశిస్తే, ఎక్కడా ఆగకుండా స్వామి సన్నిధికి వెళ్లి, దర్శనం పూర్తి చేసుకుని, రెండు నుంచి మూడు గంటల్లోనే బయటకు వచ్చేస్తారని తెలిపారు.

వాస్తవానికి ఈ నిర్ణయాన్ని నేటి నుంచే అమలు చేయాలని భావించినా, వారాంతం కావడం, నిన్న మధ్యాహ్నానికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 15 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి వుండటంతో మంగళవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. కాగా, ఈ ఉదయం 4 కంపార్టుమెంట్లలో స్వామి దర్శనం కోసం భక్తులు వేచివున్నారు.


More Telugu News