టీడీపీ పనైపోయిందన్న వాళ్లకు నామినేషన్ల దాఖలే దీటైన జవాబు: ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి
- వైసీపీ బెదిరింపులకు తట్టుకుని నిలిచామని ధీమా
- 92 శాతం నామినేషన్లు వేశామని వెల్లడి
- ఏకగ్రీవం అయింది 84 స్థానాలేనన్న దీపక్ రెడ్డి
టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి రాష్ట్రంలో తాజా పరిణామాలపై స్పందించారు. వైసీపీ బెదిరింపులు తట్టుకుని 92 శాతం నామినేషన్లు వేశామని చెప్పారు. తమ పార్టీ నేతలు అన్ని కేటగిరీల్లో 12,336 నామినేషన్లు వేశారని వెల్లడించారు. స్వల్ప కారణాలతో 220 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వివరించారు.
టీడీపీ నేతలను బెదిరించి 482 నామినేషన్లు వెనక్కి తీసుకునేలా చేశారని దీపక్ రెడ్డి ఆరోపించారు. 224 స్థానాల్లో నామినేషన్ల విత్ డ్రాలో పోలీసుల పాత్ర ఉందని అన్నారు. 83 ఎంపీటీసీ, 1 జడ్పీటీసీ కలిపి 84 స్థానాలే ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. టీడీపీని అడ్డుకునే బలం వైసీపీకి లేదని ఇక్కడే తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. టీడీపీ పనైపోయిందన్న వాళ్లకు నామినేషన్ల దాఖలే దీటైన జవాబు అని పేర్కొన్నారు.