కరోనా మృతులకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన కేంద్రం
- దేశంలో 83కి చేరిన కరోనా కేసులు
- ఇప్పటివరకు ఇద్దరు మృతి
- కరోనా మృతుల కుటుంబాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులతో చేయూత
- బాధితుల వైద్యఖర్చులను భరించాలని కేంద్రం నిర్ణయం
ప్రాణాంతక కరోనా వైరస్ ను భారత కేంద్ర ప్రభుత్వం విపత్తుగా గుర్తించింది. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా ఇద్దరు మరణించగా, ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. కరోనా మృతుల కుటుంబాలను ఎస్టీఆర్ఎఫ్ నిధుల సాయంతో ఆదుకోవాలని నిర్ణయించారు. కరోనా బాధితుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. భారత్ లో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 83 కాగా, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది.