భక్తులను కంపార్ట్ మెంట్లలో కూర్చోనివ్వరాదని టీటీడీ నిర్ణయం
- కరోనా ప్రభావం నేపథ్యంలో టీటీడీ జాగ్రత్తలు
- భక్తులకు టైమ్ స్లాట్ టోకెన్ల ద్వారా దర్శనం
- భక్తులు నిర్ణీత సమయానికి దర్శనం చేసుకోవాలన్న ఈవో
కరోనా వైరస్ దేశమంతటా ఉనికి చాటుకుంటుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. తిరుమల పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుండడంతో కరోనా ముప్పు ఉండొచ్చని టీటీడీ భావిస్తోంది. అందుకే భక్తులు ఎక్కువ సేపు ఒకే ప్రాంతంలో వేచి చూసే అవసరం లేకుండా టైమ్ స్లాట్ టోకెన్ల ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.
మంగళవారం నుంచి భక్తులను కంపార్ట్ మెంట్లలో కూర్చోనివ్వకుండా చర్యలు తీసుకోనున్నారు. దీనిపై టీటీడీ ఈవో మాట్లాడుతూ, గంటకు 4,500 మంది భక్తులు దర్శించుకునేలా టైమ్ స్లాట్ టోకెన్లు జారీ చేస్తామని చెప్పారు. భక్తులు నిర్ణీత సమయానికి వచ్చి దర్శనం చేసుకోవాలని సూచించారు. తిరుమల వచ్చే భక్తులు తప్పకుండా గుర్తింపు కార్డులు తీసుకురావాలని స్పష్టం చేశారు.