ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలంటూ కలెక్టర్లకు ఈసీ ఆదేశాలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు
  • ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు వద్దన్న ఈసీ
  • ఆదేశాలు పాటించకపోతే చర్యలు తప్పవన్న ఎన్నికల కమిషనర్
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీ ఓటర్లను ప్రభావితం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చర్యలను చేపట్టవద్దని సూచించింది. రాష్ట్రంలో ఇళ్ల స్థలాల పంపిణీ నిలిపివేయాలంటూ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

తమ ఆదేశాలను పాటించి తీరాల్సిందేనని, ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి ఎలాంటి కార్యాచరణకు ప్రయత్నించినా చర్యలు తప్పవని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీలో భాగంగా టెండర్ల ఆహ్వానం, టోకెన్ల పంపిణీ వంటి చర్యలు నిలిపివేయాలని పేర్కొన్నారు. అంతేకాకుండా, స్థలాల గుర్తింపు, లబ్దిదారుల ఎంపిక వంటి కార్యక్రమాల్లో కూడా అధికారులు పాల్గొనరాదని రమేశ్ కుమార్ అన్నారు. ఇలాంటి చర్యలు ఎన్నికల కోడ్ కు విరుద్ధమని తెలిపారు.


More Telugu News