కరోనాపై మోదీ ఇచ్చిన పిలుపుకు సానుకూలంగా స్పందించిన పాక్

  • సార్క్ దేశాలు ఉమ్మడిగా కదిలిరావాలన్న మోదీ
  • ప్రత్యేక ప్రతినిధిని పంపిస్తామన్న పాక్
  • ఉమ్మడి వ్యూహాలతో కరోనాను కట్టడి చేయడం సాధ్యమేనని ఉద్ఘాటన
కరోనా వైరస్ పై పోరాడేందుకు సార్క్ దేశాలన్నీ ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును పాకిస్థాన్ స్వాగతించింది. పాక్ తరఫున సార్క్ దేశాల నేతల వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక సహాయకుడు జాఫర్ మీర్జా పాల్గొంటారని ఓ ప్రకటనలో వెల్లడించింది. కరోనా వంటి మహమ్మారిని నియంత్రించడంలో ఉమ్మడి వ్యూహరచన, ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తాయని పాక్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఐషా ఫరూఖీ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఇప్పటివరకు పాక్ లో 22 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. కరోనాపై సార్క్ దేశాలు ఐక్యంగా కదిలిరావాలని మోదీ ప్రతిపాదించగా, ఆయా దేశాల నుంచి సానుకూల స్పందన వచ్చింది.


More Telugu News