నాని, సుధీర్ బాబుల సినిమా 'వి' విడుదల వాయిదా

నాని, సుధీర్ బాబుల సినిమా 'వి' విడుదల వాయిదా
  • విడుదలను వచ్చే నెలకు వాయిదా వేసిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్
  • కరోనా కారణంగా విడుదల వాయిదా
  • ప్రేక్షకుల ఆరోగ్యం తమకు ముఖ్యమంటూ ప్రకటన
కరోనా వైరస్ కారణంగా నాని, సుధీర్ బాబు, నివేదా థామస్, అదితీరావు హైదరీ కాంబినేషన్లో వస్తున్న 'వి' మూవీ విడుదల వాయిదా పడింది. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వ వహించారు. సినిమాను విడుదలను వాయిదా వేస్తున్నట్టు శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ ఓ ప్రకటనను విడుదల చేసింది.

నిర్ణీత సమయానికి సినిమాను విడుదల చేయడానికి సర్వం సిద్ధం చేశామని... అయితే, కరోనా కారణంగా తమ నిర్ణయాన్ని మార్చుకున్నామని శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ప్రేక్షకుల ఆరోగ్యం, క్షేమం తమకు ముఖ్యమని... అది తమ బాధ్యత అని చెప్పింది. సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామని... వచ్చే నెలలో విడుదల చేస్తామని తెలిపింది. కరోనా నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరింది.


More Telugu News