2,000 మంది అడ్డగించినా మన వాళ్లు నామినేషన్లు వేశారు: నాదెండ్ల మనోహర్
- 'శ్రీకాళహస్తిలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయో చూశాం
- అయినప్పటికీ అర్ధరాత్రి వరకు జనసేన నేతలు పోరాడి నిలబడ్డారు
- అనంతపురంలో 100 మంది నామినేషన్‌లు వేయడానికి వెళ్తుంటే దాడి
- జనసేనకు, ఇతర పార్టీలకు ఉన్న తేడాలను మనం తెలపాలి
వైసీపీపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమై ప్రసంగిస్తున్నారు. ఇందులో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ... పార్టీలో చాలా మంది త్యాగమూర్తులు ఉన్నారు. మన పార్టీకి స్ఫూర్తినిచ్చేది యువతే. మార్పుకోసం సమాజంలో స్వార్థం లేకుండా, కుళ్లు రాజకీయాలకు దూరంగా ఉండి దేశంలో ఎంతో మంది యువత త్యాగాలు చేస్తున్నారు. అదే స్ఫూర్తిని ఆంధ్రయువతలో నింపుతూ పవన్ కల్యాణ్ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు' అని చెప్పారు.
'శ్రీకాళహస్తిలో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయో చూశాం. అయినప్పటికీ అర్ధరాత్రి వరకు జనసేన నేతలు పోరాడి నిలబడ్డారు. అనంతపురంలో 100 మంది నామినేషన్‌లు వేయడానికి వెళ్తుంటే 2000 మంది రోడ్డుకి అడ్డంగా నిలబడి రాళ్లు వేశారు. అయినప్పటికీ ధైర్యంగా ఎదుర్కొని నామినేషన్ వేశారు. అటువంటి నేతలు, కార్యకర్తలు మన పార్టీలో ఉన్నారు' అని తెలిపారు.
'జనసేనకు, ఇతర పార్టీలకు ఉన్న తేడాలను మనం తెలపాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కచ్చితంగా పండుగ వాతావరణంలో జరగాలి. మంచి నేతలను గుర్తించడం కోసం యువతకు ఇందులో పవన్ కల్యాణ్ అవకాశం కల్పించారు' అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.