సింధియా కారుపై ఈ దాడిని కాంగ్రెస్ ప్రభుత్వమే చేయించింది!: శివరాజ్ సింగ్ చౌహాన్ ఫైర్
- భోపాల్ లో సింధియా ప్రయాణిస్తున్న కారుపై దాడి
- కాంగ్రెస్ ప్రభుత్వమే దాడి చేయించిందన్న చౌహాన్
- దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఇటీవలే బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాపై భోపాల్ లో దాడి జరిగింది. కాంగ్రెస్ వర్గీయులే ఈ దాడి చేశారని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై రాళ్లు రువ్వారని మండిపడ్డారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎలా ఉన్నాయో దీని వల్ల అర్థమవుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ దాడులు చేయించిందని ఆరోపించారు. ఈ ఘటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని... దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. సింధియా కారు డ్రైవర్ చాకచక్యంతో వాహనాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లంతో ప్రమాదం తప్పిందని చౌహాన్ చెప్పారు.
జ్యోతిరాదిత్య సింధియా భోపాల్ ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా ఈ దాడి జరిగింది. ఆందోళనకారులు నల్ల జెండాలను చూపుతూ నిరసన వ్యక్తం చేశారు.