సంజయ్ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్: కామెంట్రీ ప్యానెల్ నుంచి తొలగింపు
- పనితీరు నచ్చకే వేటు వేసినట్లు సమాచారం
- మిగిలిన ముగ్గురు కొనసాగింపు
- డ్యాషింగ్ బ్యాట్స్‌మన్‌గా ఒకప్పుడు గుర్తింపు
కామెంట్రీ ప్యానెల్లో సభ్యుడైన టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ప్యానెల్ నుంచి అతని పేరును తొలగించింది. అయితే ఇందుకు కారణాలు మాత్రం పేర్కొనలేదు. అతని పనితీరు నచ్చకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో ధర్మశాలలో జరగాల్సిన వన్డే మ్యాచ్‌కి (ఇది రద్దయింది) ప్యానెల్ సభ్యులైన సునీల్ గవాస్కర్, ఎల్.శివరామకృష్ణన్, మురళీకార్తీక్లు హాజరైనా సంజయ్ మంజ్రేకర్ కనిపించక పోవడం ఈ వార్తకు బలం చేకూరుస్తోంది. ‘మంజ్రేకర్ పనితీరుపట్ల అధికారులు సంతోషంగా లేరు. అందుకే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది అని ఓ అధికారి తెలిపారు’ అంటూ ఓ ఆంగ్ల దినపత్రిక ఈ వ్యవహారంపై కథనం ప్రచురించడంతో విషయం వెలుగు చూసింది.