మన ప్రెసిడెంట్ పవన్ కల్యాణ్ గారు ఇప్పటికే చాలా దెబ్బలు కొట్టారు: నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం
- పాల్గొని మాట్లాడిన నాగబాబు
- బండరాయి మీద ఓ దెబ్బేస్తే అది పగలదు
- 100వ దెబ్బేస్తే పగులుతుంది
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమై ప్రసంగిస్తున్నారు. ఇందులో నాగబాబు మాట్లాడుతూ నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుందని చెప్పారు.
'మొదటిసారి జనసేన ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడుతున్నాను. ఎక్కువ సమయం మాట్లాడదలుచుకోలేదు. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ లాంటి వారు ఉన్నారు.. వారికి సమయం ఇవ్వడానికి ప్రాధాన్యతనిస్తాను. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ వేస్తున్నవారిని తన్నడం కత్తులతో పొడవడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భయపడకండి.. ఇటువంటి బెదిరింపులు మామూలే. ఎందుకంటే హిట్లర్ కంటే గొప్పోడు ఎవరూ లేడిక్కడ. అటువంటి వాడే పతనమైపోయాడు. ఇది కూడా ఎంతో కాలం పట్టదు' అని చెప్పారు.
'బండరాయి మీద ఓ దెబ్బేస్తే అది పగలదు. 99 దెబ్బలేసినా పగలదు.. 100వ దెబ్బేస్తే పగులుతుంది. మన పవన్ కల్యాణ్.. మన ప్రెసిడెంట్ గారు చాలా దెబ్బలు కొట్టారు. ఒకరోజు కుళ్లిన రాజకీయాలు అనే బండరాయి బద్దలయ్యే రోజు వస్తుంది. నాలుగేళ్లలో జనసేన అధికారంలోకి వస్తుంది' అని తెలిపారు.