పెట్రోల్, డీజిల్ పై లీటర్‌కు రూ.3 ఎక్సైజ్ సుంకం పెంపు

  • దేశీయ మార్కెట్ లో ధరలు పెరిగే అవకాశం ఉండకపోవచ్చు 
  • అంతర్జాతీయ మార్కెట్ లో పతనమైన చమురు ధరలు 
  • మిగులు ఆదాయాన్ని జమ చేసుకునేందుకు కేంద్రం యత్నం

అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు భారీగా పతనం కావడంతో ఆ విధంగా ఆదా అవుతున్న డబ్బును సొంత ఖాతాకు తరలించే ఎత్తుగడతో కేంద్రం ఎక్సైజ్ సుంకాన్ని భారీగా పెంచింది. పెట్రోలు, డీజిల్ పై లీటరుకు మూడు రూపాయల సుంకాన్ని పెంచుతూ ఆదేశాలు జారీచేసింది. కరోనా ప్రభావం, ఒపెక్ దేశాలైన సౌదీ అరేబియా, రష్యాల మధ్య వివాదం, అంతర్జాతీయ మార్కెట్లో సంక్షోభం తదితర కారణాలతో ఇటీవల కాలంలో క్రూడాయిల్ ధరలు సగానికి తగ్గిపోయిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర 35 డాలర్లకు అటూఇటూ పలుకుతోంది. దీంతో ఈ విధంగా దేశీయ మార్కెట్ నుంచి ఆదాఅవుతున్న మొత్తాన్ని సాధారణంగా వినియోగదారులకు ప్రభుత్వాలు బదలాయించాలి. కానీ భారీమొత్తం ఆదా అవుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని పెంచి ఆ లాభాలను ప్రభుత్వ ఖాతాకు జమచేసుకునే ఎత్తుగడలో భాగమే ఇది.

ఎక్సైజ్ సుంకాన్ని పెంచితే సాధారణంగా దేశీయంగా పెట్రోధరలు పెరగాలి, కానీ ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గుతున్నందున ఇక్కడ పెద్దగా పెరిగే అవకాశం లేదు.



More Telugu News