వక్కంతం వంశీకి రవితేజ గ్రీన్ సిగ్నల్

  • 'నా పేరు సూర్య'తో పరాజయం 
  • కథలపై కసరత్తు చేస్తూ వచ్చిన వక్కంతం 
  • తదుపరి సినిమాకి సన్నాహాలు
సినీ కథారచయితగా వక్కంతం వంశీకి మంచి పేరుంది. ఎన్నో విజయవంతమైన సినిమాలకు ఆయన పనిచేశాడు. రచయితగానే కాకుండా 'నా పేరు సూర్య'తో దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని సాధించలేదు. అప్పటి నుంచి ఆయన కథలపై కసరత్తు చేస్తూనే వస్తున్నాడు.

ఇటీవల ఆయన రవితేజను కలిసి ఒక కథ వినిపించాడట. కథ నచ్చిందని రవితేజ చెప్పడంతో, కొంత సమయం తీసుకుని బౌండ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేసి తీసుకొచ్చి మరీ వినిపించాడట. కథాకథనాలు .. తన పాత్రకి సంబంధించిన పూర్తి క్లారిటీ రావడంతో, రవితేజ సంతృప్తిని వ్యక్తం చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. దాంతో ఆ తరువాత పనుల్లో వక్కంతం వంశీ బిజీ అయ్యాడని అంటున్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో రవితేజ 'క్రాక్' చేస్తున్నాడు. రమేశ్ వర్మ .. నక్కిన త్రినాథరావు లైన్లో వున్నారు. మరి ఆ ఇద్దరి ప్రాజెక్టుల తరువాత వక్కంతంతో చేస్తాడా? లేదంటే ముందుగా వక్కంతంతోనే సెట్స్ పైకి వెళతాడా? అనేది చూడాలి.


More Telugu News