'ఆచార్య' సినిమాలో హీరోయిన్ గా కాజల్?

  • షూటింగు దశలో 'ఆచార్య'
  • ప్రాజెక్టు నుంచి తప్పుకున్న త్రిష 
  • మరో సారి చిరూ జోడీగా కాజల్
చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ఇప్పటికి ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. సందేశంతో కూడిన ఈ వినోదభరిత చిత్రంలో కథానాయికగా త్రిషను ఎంపిక చేసుకున్నారు. త్వరలో షూటింగుకి ఆమె హాజరు కావలసి వుంది. అయితే తను ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంటున్నట్టుగా ట్విట్టర్ వేదికగా త్రిష తెలియజేసింది.

తీరా షూటింగ్ దగ్గర పడుతుండగా ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసింది. 'స్టాలిన్' తరువాత ఈ జంటను తెరపై చూడాలనుకున్నవారు నిరాశ చెందారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆమెతో సంప్రదింపులు పూర్తయ్యాయని అంటున్నారు. తదుపరి షెడ్యూల్ షూటింగుకి కాజల్ హాజరు కానుందని చెబుతున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News