దేశంలో డేంజర్ బెల్స్.. రెండుకు పెరిగిన కరోనా మృతుల సంఖ్య
- చికిత్స పొందుతూ మృతి చెందిన ఢిల్లీ మహిళ
- రెండో మృతిని ధ్రువీకరించిన వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్
- తొలి మరణం హైదరాబాద్‌లోనే..
దేశంలో కరోనా వైరస్ కారణంగా మరొకరు మృతి చెందారు. దీంతో ఈ మహమ్మారి కారణంగా మృతి చెందిన వారి సంఖ్య రెండుకు చేరింది. కరోనా లక్షణాలతో ఢిల్లీలోని రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రిలో చేరిన 68 ఏళ్ల ఢిల్లీ మహిళ మృతి చెందింది. ఈ మేరకు ఢిల్లీ వైద్యశాఖ కార్యదర్శి ప్రీతి సుదాన్ తెలిపారు. ఆమె మృతితో దేశంలో కరోనా మృతుల సంఖ్య రెండుకు పెరిగింది.
గత నెలలో స్విట్జర్లాండ్ నుంచి కుమారుడితో కలిసి వచ్చిన సదరు మహిళకు పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో ఈ నెల 7న ఆమెను రామ్‌మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 9న ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్స్‌పైనే ఉంచి చికిత్స అందించారు. అయితే, పరిస్థితి మరింత దిగజారడంతో గత రాత్రి ఆమె మృతి చెందారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన ఒకరు హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. దేశంలో ఇది తొలి కరోనా మరణం కాగా, తాజాగా ఢిల్లీలో రెండో మరణం నమోదైంది.