కరోనా దృష్ట్యా మాస్కులు, శానిటైజర్లను నిత్యావసరాల జాబితాలో చేర్చిన కేంద్రం
- దేశంలో విస్తృతంగా ప్రబలుతున్న కరోనా
- మాస్కులు, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని రాష్ట్రాలకు ఆదేశం
- ఆదేశాలు పాటించనివారిపై చర్యలు
దేశంలో కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. మాస్కులు, శానిటైజర్లను నిత్యావసరాల జాబితాలో చేర్చింది. కరోనా వ్యాప్తి కారణంగా వాటిని నిత్యావసరాల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించింది. మాస్కులు, శానిటైజర్లను సామాన్యులకు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. తక్కువ ధరకే అందించేలా చూడాలని స్పష్టం చేసింది. ఆదేశాలు అమలు చేయనివారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. సహాయకేంద్రాల నంబర్లు, నిత్యావసరాల జాబితా ప్రచురించాలని పేర్కొంది.