నేను టీడీపీని వీడుతున్నానన్న వదంతులు అబద్ధం: శిద్ధా రాఘవరావు

  • టీడీపీకి శిద్ధా గుడ్ బై చెబుతున్నారంటూ వదంతులు
  • ఆ వదంతులను నమ్మొద్దు
  • టీడీపీని వీడే ఆలోచన లేదు
ప్రకాశం జిల్లాలో టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారంటూ వస్తున్న వదంతులపై ఆయన స్పందించారు. పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని సూచించారు. ఈ వదంతులను ఖండిస్తున్నట్టు చెప్పారు. టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. కాగా, శిద్ధా రాఘవరావు ప్రస్తుతం దర్శి టీడీపీ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. రాఘవరావుకు చెందిన గ్రానైట్ కంపెనీలో ఇటీవలే విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే టీడీపీని వీడి వైసీపీలో చేరనున్నట్టు ఆయనపై వదంతులు వ్యాపించాయి.


More Telugu News