ఏపీ ఎన్నికల సంఘాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి నడుపుతున్నారు: టీడీపీ నేత పట్టాభి విమర్శలు
- 'స్థానిక’ ఎన్నికల్లో ప్రతిపక్షాన్ని ఎదుర్కోలేని దుస్థితిలో వైసీపీ ఉంది
- ఈ ఎన్నికలంటే జగన్ ‘గజ గజ గజ‘ వణికిపోతున్నాడు
- పోలీసులను అడ్డంపెట్టుకుని మా అభ్యర్థులపై దౌర్జన్యం చేస్తారా?
ఏపీ ఎన్నికల సంఘాన్ని నడుపుతోంది నిమ్మగడ్డ రమేశ్ కాదు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షపార్టీని ఎదుర్కోలేని దుస్థితిలో అధికార వైసీపీ ఉందని విమర్శలు చేశారు.
2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు నిర్వహించినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రచారానికి కూడా వెళ్లలేదని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్ మాత్రం స్థానిక సంస్థల ఎన్నికలంటే ‘గజ గజ గజ’ వణికిపోతున్నాడని, కేవలం, పది నెలల కాలంలోనే ప్రజల విశ్వాసం కోల్పోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని నామినేషన్లు వేసేందుకు వెళ్లిన తమ అభ్యర్థులపై వైసీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్నారని దుయ్యబట్టారు.