కరోనా ప్రభావంతో కీలక నిర్ణయాలు తీసుకున్న సుప్రీంకోర్టు

  • సోమవారం నుంచి ముఖ్యమైన కేసులే విచారణ
  • న్యాయవాదులు, పిటిషనర్లు, ప్రతివాదులకు మాత్రమే అనుమతి
  • కొన్నిరోజుల పాటు ఇలాగే కార్యకలాపాలు కొనసాగిస్తామన్న సుప్రీం
ప్రమాదకర కరోనా వైరస్ అదీఇదీ అని కాకుండా అన్ని రంగాలపైనా తన ప్రభావం చూపిస్తోంది. మనిషి ప్రాణాలను హరించడమే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సైతం ఈ మహమ్మారి కుంగదీస్తోంది. భారత్ లోనూ కరోనా ప్రభావం గణనీయస్థాయిలో ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

ఈ క్రమంలో సోమవారం నుంచి ముఖ్యమైన కేసులే విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. కోర్టు హాల్లోకి న్యాయవాదులు, పిటిషనర్లు, ప్రతివాదులకు మాత్రమే అనుమతి ఉంటుందని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ వెల్లడించారు. కోర్టుకు వచ్చేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. సోమవారం నుంచి ఈ జాగ్రత్త చర్యలు కొన్నిరోజుల పాటు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.


More Telugu News