టీడీపీ అభ్యర్థి ఇంట్లో మద్యం సీసాలు పెట్టారంటూ ఈసీకి చంద్రబాబు లేఖ

  • తెనాలి టీడీపీ అభ్యర్థి నివాసంలో మద్యం సీసాలు
  • ప్రత్యర్థుల పనే అని సీసీ కెమెరా ఫుటేజిలో వెల్లడి
  • అభ్యర్థి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న చంద్రబాబు
రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నడూ లేనంతగా వాడీవేడి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో ప్రత్యర్థులు మద్యం సీసాలను దొంగచాటుగా పెట్టడం కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.

తెనాలిలో టీడీపీ అభ్యర్థి ఇంట్లో అక్రమంగా మద్యం సీసాలు పెట్టారంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎక్సైజ్ సిబ్బంది ఎవరూ చెప్పకుండానే నేరుగా మద్యం ఉంచిన చోటుకే వెళ్లడం అనుమానాలు కలిగిస్తోందని ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో మద్యం సీసాల ఘటనపై టీడీపీ అభ్యర్థి ఫిర్యాదు చేసినా పోలీసులు ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేతలతో పోలీసులు, ఆబ్కారీ సిబ్బంది కుమ్మక్కైనట్టుగా కనిపిస్తోందని ఆరోపించారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.


More Telugu News