కరోనా సమయంలో మంచి బహుమతి వచ్చింది.. ఫొటో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- రీయూజబుల్ కరోనా మాస్కును పంపిన స్నేహితుడు
- ఆయనకు ధన్యవాదాలు చెబుతూ మహీంద్రా పోస్టు
- ఈ పోస్టుకు ఓ వైపు లైకులు.. మరో వైపు విమర్శలు
దేశంలో మెల్లగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రాకు ఓ మంచి బహుమతి వచ్చిందట. ఆయనే ఈ విషయాన్ని చెబుతూ, శుక్రవారం ట్విట్టర్ లో ఓ ట్వీట్ చేశారు. తనకు బహుమతిగా వచ్చిన కరోనా మాస్క్ ఫొటోను పోస్టు చేశారు.
‘‘ప్రస్తుత సమయంలో మంచి బహుమతిని పంపిన నా స్నేహితుడు అశోక్ కురియన్ కు ధన్యవాదాలు. భారతీయ శాస్త్రవేత్తకు చెందిన స్విస్ కంపెనీ ఈ మాస్కులను తయారు చేసింది. వైరస్ చనిపోయేలా ఉతికి, మళ్లీ మళ్లీ వాడటానికి వీలుగా దీనిని తయారు చేశారు. లివిన్ గ్రాడ్ కంపెనీ ఇండియాలో దానిని తయారు చేయడం మొదలుపెట్టింది.” అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.
రీయూజబుల్ మాస్కు పంపారని..
ఆనంద్ మహీంద్రాకు ఆయన స్నేహితుడు అశోక్ కురియన్ ఒక రీయూజబుల్ (మళ్లీ మళ్లీ వాడగలిగే) ఎన్95 మాస్కును బహుమతిగా పంపించారు. తనకు ఆ బహుమతిని పంపిన అశోక్ కురియన్ ను ప్రశంసిస్తూ ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.‘‘ప్రస్తుత సమయంలో మంచి బహుమతిని పంపిన నా స్నేహితుడు అశోక్ కురియన్ కు ధన్యవాదాలు. భారతీయ శాస్త్రవేత్తకు చెందిన స్విస్ కంపెనీ ఈ మాస్కులను తయారు చేసింది. వైరస్ చనిపోయేలా ఉతికి, మళ్లీ మళ్లీ వాడటానికి వీలుగా దీనిని తయారు చేశారు. లివిన్ గ్రాడ్ కంపెనీ ఇండియాలో దానిని తయారు చేయడం మొదలుపెట్టింది.” అని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.