కోర్టులో ఒకరోజు గడిపిన డీజీపీ ఇకనైనా సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా: గల్లా జయదేవ్

కోర్టులో ఒకరోజు గడిపిన డీజీపీ ఇకనైనా సరైన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా: గల్లా జయదేవ్
  • చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై డీజీపీ వివరణ కోరిన హైకోర్టు
  • విచారణ సందర్భంగా హైకోర్టుకు స్వయంగా వచ్చిన గౌతమ్ సవాంగ్
  • చట్టం అమలుపై క్లాస్ చెప్పించుకున్నారంటూ డీజీపీపై గల్లా వ్యాఖ్యలు
విశాఖలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా తలెత్తిన పరిణామాలపై హైకోర్టు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను తమ సమక్షానికి పిలిపించి వివరణ తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు.

"కోర్టులో ఒకరోజు గడిపి, చట్ట పరిరక్షణ ఎలా చేయాలో క్లాస్ చెప్పించుకున్న తర్వాత ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు సరైన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. గత కొన్నినెలలుగా ఉల్లంఘనకు గురవుతున్న అమరావతి ప్రజల ప్రజాస్వామ్య, మానవ హక్కులు కాపాడేందుకు డీజీపీ ఇకనైనా ఉపక్రమిస్తారని భావిస్తున్నాను" అంటూ ట్వీట్ చేశారు.


More Telugu News