మంత్రి బుగ్గనకు మున్సిపల్ చైర్మన్, 32 వార్డులు దానం చేస్తున్నాం: కేఈ కృష్ణమూర్తి
- డోన్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
- టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోంది
- రాజీనామా గురించి నా తమ్ముడు నాతో మాట్లాడలేదు
తన తమ్ముడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేయడంపై మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. పార్టీకి రాజీనామా చేసే విషయం గురించి తన తమ్ముడు తనతో మాట్లాడలేదని ఆయన చెప్పారు. ఆయన వైసీపీలోకి పోయినా తనకు అభ్యంతరం లేదని అన్నారు.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి డోన్ మున్సిపల్ ఎన్నికలపై టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లో పోటీ చేయకూడదని నిర్ణయించింది. ఈ విషయాన్ని కేఈ ప్రకటించారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మున్సిపల్ చైర్మన్, 32 వార్డులను దానం చేస్తున్నామని అన్నారు. టీడీపీ అభ్యర్థులపై వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని చెప్పారు.