ఏడు నెలల తర్వాత గృహనిర్బంధం నుంచి విడుదల కానున్న ఫరూఖ్‌ అబ్దుల్లా

  •  370 అధికరణ రద్దు నేపథ్యంలో ఫరూఖ్‌ గృహనిర్బంధం  
  • తాజాగా గృహనిర్బంధం ఎత్తివేత
  • జమ్మూకశ్మీర్‌ పరిపాలనా విభాగం ఆదేశాలు
జమ్మూకశ్మీర్‌లో 370 అధికరణ రద్దు నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రులు ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లాను పోలీసులు నిర్బంధంలో ఉంచిన విషయం తెలిసిందే. ఏడు నెలల నిర్బంధం అనంతరం ఫరూఖ్‌ అబ్దుల్లా విడుదల కానున్నారు.

ఆయనపై విధించిన గృహ నిర్బంధాన్ని ఎత్తివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రజాభద్రత చట్టం కింద ఆయనను ఇన్నాళ్లు గృహనిర్బంధంలో ఉంచారు. ఫరూఖ్ అబ్దుల్లాను వెంటనే విడుదల చేయాలని జమ్మూకశ్మీర్‌ పరిపాలనా విభాగం ఆదేశాలు ఇచ్చింది. కాగా, ఫరూఖ్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, ఒమర్‌ అబ్దుల్లా గృహనిర్బంధంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.


More Telugu News