నామినేషన్‌లు వేయడానికి వస్తుంటే పత్రాలు లాక్కొని పారిపోతున్నారు: యనమల

  • గవర్నర్‌ కూడా స్పందించలేని పరిస్థితి
  • రాష్ట్రంలో అక్రమాలు, దౌర్జన్యాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి
  • రాజ్‌భవన్‌ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం
  • అప్రజాస్వామిక చర్యలపై గవర్నర్‌కు 2, 3 సార్లు ఫిర్యాదు చేశాం
ఏపీలో పరిస్థితులపై గవర్నర్‌ కూడా స్పందించలేని పరిస్థితులు నెలకొన్నాయని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ రోజు మంగళగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... 'రాష్ట్రంలో అక్రమాలు, దౌర్జన్యాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. రాజ్‌భవన్‌ పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అప్రజాస్వామిక చర్యలపై గవర్నర్‌కు రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేశాం' అని తెలిపారు.

'పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కోర్టులు, గవర్నర్‌ ఆ తర్వాత ప్రజలకు కూడా ఉంది. నామినేషన్‌లు వేయడానికి వస్తుంటే పత్రాలు లాక్కొని పారిపోతున్నారు. కొందరిని బెదిరించి కొట్టి వెనక్కి పంపుతున్నారు. పోలీసులు చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకుని ప్రవర్తిస్తున్నారు. కోర్టులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి' అని యనమల వ్యాఖ్యానించారు. ఓటు హక్కుతో ప్రజలు ప్రభుత్వానికి గట్టి బుద్ధి చెప్పాలి. రాష్ట్ర పరిస్థితులపై గవర్నర్‌ చేతులు ఎత్తేస్తున్నారని, అన్ని వ్యవస్థలూ చేతులెత్తేస్తున్నాయని ఆయన అన్నారు.


More Telugu News