జేసీ దివాకర్‌ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడి మధ్య వాగ్వివాదం.. ఉద్రిక్తత

  • తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఘటన
  • కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దివాకర్‌రెడ్డి
  • అందులో హర్షవర్ధన్‌ ఉన్నారని అడ్డుకున్న పోలీసులు 
  • టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వివాదం
తాడిపత్రి మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆ కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించిన దివాకర్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కార్యాలయంలో హర్షవర్ధన్ ఉన్నారని, దీంతో జేసీని కాసేపటి తర్వాత పంపిస్తామని పోలీసులు చెప్పారు.

ఈ నేపథ్యంలో అక్కడే జేసీ, హర్షవర్ధన్‌ వాగ్వివాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం పెరిగిపోవడంతో అక్కడి నుంచి ఇరు వర్గాల వారిని పోలీసులు పంపించారు. మరోవైపు తాడిపత్రిలో నామినేషన్‌ వేసి తిరిగి వెళ్తుంటే తమను వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బెదిరించారంటూ టీడీపీ నేత జింకా లక్ష్మీదేవి నిరసనకు దిగారు. ఆమె అక్కడి 36వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌గా నామినేషన్‌ వేశారు.


More Telugu News