ఇక అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధం.. నిర్వహించండి: గవర్నర్‌ను కోరిన కమల్‌నాథ్‌

  • గవర్నర్‌ను కలిసిన సీఎం
  • రానున్న అసెంబ్లీ సమావేశాల్లోనే బలపరీక్ష నిర్వహించాలి
  • తేదీపై నిర్ణయం స్పీకర్‌ తీసుకోవాలి
మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు ఊహించని మలుపు తిరిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ సర్కారు బలపరీక్షకు సిద్ధమైంది. అసెంబ్లీలో పరీక్ష నిర్వహించాలని కోరుతూ ఈ రోజు కమల్‌నాథ్‌ తమ రాష్ట్ర గవర్నర్‌ లాల్జీ టాండన్‌కు ఓ వినతి పత్రం సమర్పించారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బలపరీక్ష ఎదుర్కొంటామని, తేదీని అసెంబ్లీ స్పీకరే నిర్ణయించాలని ఆయన కోరారు.  

అనంతరం కమల్‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ... 'బలపరీక్ష జరుగుతుంది.. కానీ, నిర్బంధంలో ఉన్న 22 మంది ఎమ్మెల్యేలను విడిచిపెడితేనే ఇది సాధ్యం కదా' అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇవ్వడంతో కమల్‌నాథ్‌ సర్కారు మైనారిటీలో పడిన విషయం తెలిసిందే.


More Telugu News