వైరస్ విజృంభణ కథతో 2011లో వచ్చిన సినిమాను ఇప్పుడు విపరీతంగా చూస్తున్నారు!
- ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం
- వైరస్‌పై వచ్చిన సినిమాపై ప్రేక్షకుల ఆసక్తి
- మెడికల్ థ్రిల్లర్ సినిమాగా కంటెజియన్
- భారీగా పెరిగిన డౌన్‌లోడ్లు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కలకలం రేపుతోన్న నేపథ్యంలో గతంలో వైరస్‌పై వచ్చిన ఓ సినిమాపై ప్రేక్షకులు ఇప్పుడు అమితాసక్తి కనబర్చుతున్నారు. అమెరికన్ మెడికల్ థ్రిల్లర్ సినిమా కంటెజియన్ (ఇంగ్లిష్ మూవీ) కథ కరోనా వైరస్‌కి సంబంధించిన కథలాగే ఉంది. దీంతో ఆ సినిమాను ప్రేక్షకులు డౌన్‌లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ఆ సినిమా డౌన్ లోడ్లు భారీగా పెరుగుతున్నాయి. ఈ సినిమాలో మాట్ డామన్, లారెన్స్ ఫిష్ బర్న్, జూడ్ లా, గ్వినేత్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టీవెన్ సోడర్ బర్గ్ తెరకెక్కించిన ఈ సినిమాను 2011, సెప్టెంబర్‌లో విడుదల చేశారు. ఈ సినిమాకు అప్పట్లో మంచి స్పందన వచ్చింది.