కరోనా బాధితులకు పోర్న్ సైట్ ఆపన్నహస్తం.. విరాళంగా మార్చి నెల మొత్తం ఆదాయం!
- ప్రకటించిన ప్రముఖ పోర్న్ సైట్ ‘పోర్న్‌హబ్’
- ‘మోడల్‌హబ్’ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని విరాళంగా ప్రకటించిన సైట్
- ఇటలీ ప్రజలకు ఉచితంగా ప్రీమియం కంటెంట్
కోవిడ్-19 బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ పోర్న్‌సైట్ ఒకటి ముందుకొచ్చింది. మార్చి నెల మొత్తం ఆదాయాన్ని బాధితుల సహాయార్థం విరాళంగా ప్రకటించింది. ఈ మేరకు ‘పోర్న్‌హబ్’ పేర్కొంది. తమ అనుబంధ సైట్ అయిన ‘మోడల్‌హబ్’ ద్వారా వచ్చే మార్చి నెల మొత్తం ఆదాయాన్ని కరోనా బాధితుల కోసం విరాళంగా ఇస్తున్నట్టు తెలిపింది. అదొక్కటే కాదు, ఇటలీ ప్రజలు తమ పోర్న్‌హబ్ సైట్‌లోని ప్రీమియం కంటెంట్‌ను ఈ నెలంతా ఉచితంగా వినియోగించుకోవచ్చంటూ ఆఫర్ కూడా ప్రకటించింది.
పోర్నహబ్ సైట్‌ను వీక్షిస్తున్న టాప్-20 దేశాల్లో ఇటలీది ఏడో స్థానం కావడం గమనార్హం. కాగా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 115 దేశాల్లో 2.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారినపడి 4 వేలమందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. చైనా తర్వాత ఇటలీలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఒక్క రోజులోనే మృతుల సంఖ్య వందల నుంచి వేలకు చేరుకుంది. ఆ దేశంలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా 1016 మంది చనిపోయారు. 15 వేల మంది వైరస్‌తో పోరాడుతున్నారు.