బోండా ఉమ, బుద్ధా వెంకన్నపై దాడి కేసు నిందితుడు కిషోర్‌కు స్టేషన్ బెయిల్!

  • కారులో వెళ్తున్న బుద్ధా, ఉమలపై కిషోర్ దాడి
  • బెయిలు ఇచ్చినా ప్రతి రోజూ స్టేషన్‌లో హాజరు కావాల్సిందే
  • కిషోర్ తరపున నామినేషన్ వేసిన మహంకాళి కన్నారావు
మాచర్లలో బుధవారం టీడీపీ నేతలు బోండా ఉమ, బుద్ధా వెంకన్న ప్రయాణిస్తున్న కారుపై దాడిచేసిన నిందితుడు, వైసీపీ పట్టణ  సంఘం అధ్యక్షుడు తురకా కిషోర్ నిన్న స్టేషన్ బెయిలుపై విడుదలయ్యాడు. దాడి అనంతరం కిషోర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. కేసు విచారణ జరిగినన్ని రోజులు కిషోర్ ప్రతి రోజూ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్టు గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు తెలిపారు.

కాగా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కిషోర్ 13వ వార్డు నుంచి బరిలోకి దిగారు. మహంకాళి కన్నారావు అనే వ్యక్తి ఆయన తరపున నిన్న నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పట్టణంలో మొత్తం 31 వార్డులు ఉండగా గత రెండు రోజుల్లో రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు కావడం విశేషం. ఆ రెండూ వైసీపీవే కావడం గమనార్హం.


More Telugu News