కేంద్ర క్యాబినెట్ అత్యవసర భేటీ!
- పెరుగుతున్న కరోనా బాధితులు
- పాతాళంలోకి పడిపోయిన మార్కెట్
- విమానాల రద్దుతో ప్రతిష్ఠంభన
- పరిస్థితులపై చర్చించనున్న క్యాబినెట్
భారత స్టాక్ మార్కెట్ పతనం, ఇండియాలో పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య, తొలి మరణం ధ్రువీకరణ కావడం, ఇతర దేశాలకు విమానాల రద్దుతో ఏర్పడిన ప్రతిష్ఠంభనలపై చర్చించేందుకు కేంద్ర క్యాబినెట్ అత్యవసరంగా సమావేశం కానుంది. అందుబాటులో ఉన్న మంత్రులందరినీ రావాలని పీఎంఓ నుంచి వర్తమానాలు వెళ్లాయి. ఈ ఉదయం 10 గంటలకు మోదీ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగనుండగా, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని సమాచారం. కరోనా వ్యాధి అనుమానితులు తిరుగాడిన ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలపై మోదీ మంత్రులతో చర్చించనున్నారని తెలుస్తోంది.